సిలువలో దేవుని స౦కల్ప౦ ఏమిటి?
10/12/2024
సిలువలో దేవుని స౦కల్ప౦ ఏమిటి?
10/12/2024

ప్రొ-ఛాయిస్: దీని అర్థం ఏమిటి?

xr:d:DAFXk0WDSFg:25,j:45162075609,t:23011320

ప్రొ-ఛాయిస్ స్థానం యొక్క విషయం ఏమిటి? తాను వ్యక్తిగతంగా అబార్షన్ చేయించుకోనని, కానీ మరొకరి హక్కును కాదనడానికి ఇష్టపడనని ఒక మహిళ చెబితే, ఆ మహిళ ఏ కారణాలతో అబార్షన్ చేయించుకోవడానికి వెనుకాడుతుంది? బహుశా ఆమె వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలనుకుంటుంది మరియు అవాంఛిత గర్భధారణను ఎదుర్కొంటుందని ఊహించకపోవచ్చు. బహుశా ఈ వ్యక్తి పిండం సజీవమైన మనిషి అని అనుకోవచ్చు లేదా పిండం యొక్క స్థితిని గురించి ఖచ్చితంగా తెలియకపోవచ్చు. పిండం సజీవమైన మనిషి అని ఆమె నమ్మవచ్చు కాని ఈ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దడానికి ఇష్టపడకపోవచ్చు. ఇక్కడ మనము ప్రొ-ఛాయిస్ దేని కొరకు నిలబడుతుందో దాని యొక్క మూలాంశానికి చేరుకున్నాము. ఎంచుకునే హక్కు సంపూర్ణమైన హక్కేనా? నైతికంగా తప్పైన దానిని ఎన్నుకునే నైతిక హక్కు మనకు ఉందా? ఇలాంటి ప్రశ్న అడగడమంటే దానికి సమాధానం చెప్పడమే.

మళ్ళీ, ప్రతి చట్టం ఒకరి ఎంపికకు హద్దులు పెడుతుంది లేదా పరిమితం చేస్తుంది. అది చట్టం యొక్క స్వభావం. చట్టము చేయడం ద్వారా ఇతరుల ఎంపికలను పరిమితం చేయకూడదనుకుంటే, మనం చట్టాలు చేయడం మానివేసి, ఓటు వేయడం మానివేయాలి. ఎంపిక చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణ స్వేచ్ఛ కాదని చాలా మంది అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఏ మానవుడూ తనకు తాను పరిపూర్ణమైన నియమం కాదు. చట్టమును మరియు సమాజమును అసాధ్యముగా చేసే స్వచ్ఛమైన సాపేక్షవాదం (రిలేటివిజం) అనే నైతిక వ్యవస్థను అంగీకరించడానికి మనము సిద్ధపడకపోతే, వ్యక్తికి స్వయంప్రతిపత్తి కలిగి ఉందన్న ప్రతిపాదన నుండి మనము గాలిలా పారిపోవాలి. నైరూప్యమైన దాని నుండి ధృడమైన దానికి వెళ్లాలంటే, ప్రో-ఛాయిస్ కార్యకర్తలు వారి వ్యక్తిగత ఆస్తిపై హక్కులను రక్షించే చట్టాలను వ్యతిరేకిస్తారా అని నేను ఆశ్చర్యపోతున్నాను? ఒకరి టెలివిజన్ దొంగిలించడానికి ఇంట్లోకి చొరబడిన దొంగకు ఆ నిర్ణయం తీసుకునే తిరుగులేని హక్కు ఉందా? స్త్రీని అత్యాచారం చేసే హక్కు పురుషుడికి ఉందా? ఎంపిక చేసుకునే స్వేచ్ఛను సంపూర్ణ హక్కుగా పరిగణించలేమని ఈ విపరీత ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.

ఏ సరిహద్దు దగ్గర ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ముగియాలి? నా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మరొక వ్యక్తి యొక్క విడదీయరాని జీవన మరియు స్వాతంత్య్ర హక్కులపై ఎక్కడ అడుగుపెడుతుందో అక్కడ ఇది ముగుస్తుందని నేను నమ్ముతున్నాను. పుట్టబోయే బిడ్డకు తన స్వంత వినాశనాన్ని ఎంచుకునే లేదా తిరస్కరించే హక్కు ఎప్పుడూ లేకపోయింది. వాస్తవానికి, ఇతరులు చెప్పినట్లుగా, యునైటెడ్ స్టేట్స్లో మనిషికి అత్యంత ప్రమాదకరమైన స్థలము స్త్రీ యొక్క గర్భములోనే. లక్షలాది మంది పుట్టబోయే బిడ్డలకు గర్భం మరణం కొరకు ఎదురుచూసే గదిగా మారింది. విచారణకు లేదా వాదనకు అవకాశం లేకుండా బందీ సంక్షిప్తంగా సంహరింపబడుతుంది. ఈ సంహరణలో అక్షరాలా అవయవం నుండి అవయవం చీల్చబడటం జరుగుతుంది. ఈ వివరణ చాలా దారుణమైన చిత్రాన్ని కనపరుస్తుందా? ఇది మానసికంగా చాలా రెచ్చగొట్టేలా ఉందా? కాదు. ఆ వివరణ అసత్యమైతే మాత్రమే అది అలా అవుతుంది.

ఎన్నుకునే హక్కు ఎంత పవిత్రమైనదైనా, మానవ జీవితాన్ని నాశనం చేసే నిరంకుశమైన హక్కును కలిగి ఉండదు. ఇది మానవ శిశువు యొక్క గర్భస్రావం ఎంతనో అంతే న్యాయం యొక్క గర్భస్రావం.

ఎంపిక చే సుకునే స్వేచ్ఛలో ఏముందని దానిని అంత ప్రశస్తమైనదిగా చేస్తుంది? పాట్రిక్ హెన్రీ “నాకు స్వేచ్ఛ ఇవ్వండి లేదా నాకు మరణాన్ని ఇవ్వండి” అని మొర్రపెట్టడానికి కారణమేమిటి? ఖచ్చితంగా మనము కొంత స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటాము, మరియు బాహ్య బలవంతము క్రింద జీవించాలనే ఆలోచన అసహ్యకరమైనదిగా ఉంటుంది. మనము ఆలోచించే జీవులము, మరియు ఎంపికలు చేయడానికి మన స్వేచ్ఛకు మనము విలువను ఇస్తాము. మనలో చాలా మంది ఖైదు చేయబడటాన్ని అసహ్యించుకుంటారు, కాని గరిష్ట-భద్రతా ఖైదులో కూడా, ఒక వ్యక్తికి ఎంచుకునే హక్కు పూర్తిగా తొలగించబడదు.

ఈ స్వయం నిర్ణయాధికార సూత్రమే- నా స్వంత స్థితి మరియు భవిష్యత్తుపై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండటం— పుట్టబోయే, అబార్షన్ చేయబడిన ప్రతి బిడ్డకు క్రూరంగా నిరాకరించబడుతుంది. అబార్షన్ చేయించుకోవాలా లేక కాలాలు నిండేంత వరకు మోయాలా అనే మా అమ్మ తీసుకునే నిర్ణయంలో నేను చెప్పగలిగేది ఏదీ లేదు. నా జీవితమంతా ఆమె చేతుల్లోనే ఉంది. ఆమె గర్భస్రావాన్ని ఎంచుకుని ఉంటే, నేను పుట్టకముందే నా జీవితం నిర్మూలించబడేది. నువ్వూ నేనూ నిజమైన మనుషులము. ఒకప్పుడు మన అమూల్యమైన ఎంపిక హక్కును వినియోగించుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఒకప్పుడు మన ఉనికి కొరకు మరొకరి ఎంపికపై పూర్తిగా ఆధారపడివున్నాము.

ఎంచుకునే హక్కు యొక్క రెండవ కీలకమైన కోణం శిశువు జీవితానికి సంబంధించిన నైతిక ఎంపికను ఎప్పుడు చేయాలనే ప్రశ్న. (ఇది లైంగిక నైతికతను కలిగి ఉంది, ఇది చర్చలో చాలా ప్రజాదరణ లేని విషయం.) బిడ్డను కలిగి ఉండాలా వద్దా అని నిర్ణయించుకునే సమయం గర్భమందు బిడ్డ పడి అభివృద్ధిని ప్రారంభము అయిన తర్వాత కాదు. అత్యాచార విషయాల్లో తప్పిస్తే , లైంగిక సంపర్కం గర్భనిరోధక సాధనాలతో లేదా అది  లేకుండా చేయడం అనేది ఇంకనూ ఎంపికకు సంబంధించిన విషయమే. మనము తీసుకునే ఎంపికలు, లైంగిక లేదా లైంగికేతర స్వభావం కలిగి ఉన్నా, ఎల్లప్పుడూ పరిణామాలు కలిగి ఉంటాయి. మన ఎంపికల పర్యవసానాలకు మనమే బాధ్యులం అనేది నైతికత మరియు చట్టం యొక్క సూత్రము.

మనము సంభోగం చేసినప్పుడు, మనం మరొక మానవ జీవితాన్ని ఉత్పత్తి చేయాలని అనుకోకపోవచ్చు లేదా కోరుకోకపోవచ్చు. అయితే, సంభోగం పునరుత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తుందని మరియు అది ఉత్పత్తి చేయగలదని మనకు తెలుసు. సంతానాన్ని చంపడం అనేది ఈ నిర్ణయాన్ని నిర్వహించడానికి బాధ్యతాయుతమైన లేదా నైతిక పద్ధతి కాదు.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

ఆర్.సి.స్ప్రౌల్
ఆర్.సి.స్ప్రౌల్
డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ లిగోనియర్ మినిస్ట్రీస్ స్థాపకుడు, సాన్ఫోర్డ్, ఫ్లోరిడా లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్లో ప్రభోధన మరియు బోధన యొక్క మొదటి పరిచారకుడు, రిఫార్మేషన్ బైబిల్ కళాశాల యొక్క మొదటి అధ్యక్షుడు మరియు టేబుల్టాక్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అతని రేడియో కార్యక్రమం, రెన్యూవింగ్ యువర్ మైండ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో స్టేషన్లలో ప్రతిరోజూ ప్రసారం చేయబడుతుంది మరియు ఆన్లైన్లో కూడా వినవచ్చు. దేవుని పరిశుద్ధత, దేవునిచే ఎన్నుకోబడటం, మరియు ప్రతి ఒక్కరూ ఒక వేదాంతవేత్తతో సహా వందకు పైగా పుస్తకాలను రచించారు. లేఖనాలలో తప్పులు లేవు అని, దేవుని ప్రజలు ఆయన వాక్య౦పై నమ్మక౦తో నిలబడవలసిన అవసరాన్ని ఆయన స్పష్ట౦గా సమర్థి౦చిన౦దుకు ఆయన ప్రప౦చవ్యాప్త౦గా గుర్తి౦చబడ్డాడు.